అతనితో కలిసి నేను ఎలా ఉంటే మీకెందుకు.. మీ పని మీరు చూసుకోండి శ్రీవల్లి హ‌ట్‌ కామెంట్స్ వైరల్..!

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక మందన్న‌ తర్వాత వరుస‌ సినిమాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక గత సంవత్సరం అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక వరుస బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన క్రేజ్‌ను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.

రష్మిక మందన్న‌ ఆ మధ్య విజయ్ దేవరకొండ తో కలిసి విదేశాలకు హాలిడే ట్రిప్‌కు వెళ్ళిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఇద్దరూ కలిసి వెళ్లకున్నా ఇద్దరు ఒకే చోటుకి వెళ్లారంటూ ఆ సమయంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది.

Vijay Deverakonda Hugs Rashmika Mandanna, Fans Hail Their Bond Saying 'Some  Hugs Never Change'

అయితే ముందుగా వీరిద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్ళినట్టు వచ్చిన వార్తలను అంతగా లైట్ తీసుకున్న ఈ ఇద్దరూ ఆ తర్వాత దానిపై స్పందించారు. ముందుగా నో అన్న ఆ తర్వాత మాత్రం అవును మేము కలిసి వెకేషన్ కి వెళ్ళాము అన్నట్లుగా ఇద్దరు ఆన్సర్ ఇచ్చారు. మేమిద్దరం కలిసి వెకేషన్ కి వెళ్ళాము అంటూ రష్మిక మందన్న‌ కూడా చెప్పుకొచ్చింది.

‘విజయ్‌తో వెకేష‌న్‌కు వెళ్ళినంత మాత్రాన తప్పేముంది అన్నట్లుగా రష్మిక ప్రశ్నించింది’. ప్రస్తుతం రష్మిక అన్నఈ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమధ్య కాలంలో రష్మిక ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నతో రష్మికను మరోసారి నెటిజన్స్ ఆడుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ తో మీరు డేటింగ్ లో ఉన్నారు అన్న వార్త‌లను రష్మిక కొట్టి పారేసింది.మేమిద్దరం మంచి స్నేహితులం.

ఆ స్నేహింతో మాత్రమే వెకేషన్‌కు వెళ్తున్నాం అన్నట్లుగా ఆమె చెప్పికొచ్చింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ బలంగా వాదిస్తున్నారు. రష్మిక విజయ్ గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించారు. ఆ సినిమాల దగ్గర నుంచి వీరి మధ్య మంచి స్నేహ సంబంధం కూడా ఏర్పడింది.

Vijay Deverakonda-Rashmika Mandana SECRET BUSTED: 2 years ago, they had  ended their relationship- Exclusive | Hindi Movie News - Times of India

ఆ చనువుతోనే రష్మిక పలు సార్లు విజయ్ దేవరకొండ కుటుంబంతో కూడా కలిసి కనిపించింది. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్తున్న వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారు అంటూ అనుమానం కలుగుతుంది. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రమే ఉంది అని నిరూపించాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇక ఇప్పుడు పైయ‌న అన్నా వ్యాఖ్యలతో రష్మిక మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.