తారక్‌కి ఆస్కార్ అవార్డు లభించదని ముందే ఫిక్సైన ఫ్యాన్స్.. ఎందుకా కామెంట్స్??

ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల హడావిడి మొదలయింది. జక్కన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్స్ కోసం పోటీలో నిలిచింది. తాజాగా సోషల్ మీడియా లో తారక్ ఫ్యాన్స్ తమ హీరో గొప్పోడంటూ డిస్కషన్ పెట్టారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు గానూ ఆస్కార్ బరిలో నిలిచింది. నాటు నాటు సాంగ్‌తో పాటుగా మరో 4 పాటలు ఆస్కార్ పోటీలో ఉండగా నాటు నాటు పాటకే ఆస్కార్ దక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఇక ఉత్తమ నటుడు కేటగిరీలో ఆస్కార్ నామినేషన్‌లో తారక్ లేకపోవడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అయిన కళ్ళతోనే పలికించే తారక్ ఆస్కార్ బరిలో లేకపోవడమేంటని పెదవి విరుస్తున్నారు. తారక్ ఆస్కార్ అవార్డ్స్ వేటలో లేనప్పటికీ తారక్ గొప్పోడు అంటూ తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో తెగ డిస్కషన్ పెట్టేస్తున్నారు. తారక్‌కు ఎప్పటికైనా ఆస్కార్ అవార్డ్ వచ్చి తీరుతుందని, తన భవిష్యత్ ప్రాజెక్ట్స్ తో కచ్చితంగా ఆస్కార్ సాధిస్తాడంటూ ఫ్యాన్స్ ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రప్రంచం మొత్తం ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం మార్చ్ నెలలో ఉండబోతుంది.

ఆస్కార్ రాకపోయినా పర్లేదనట్టు కొందరు ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నామినేషన్స్‌ ప్రకటించకముందే కొందరు ఈ కామెంట్స్ చేశారు. ఆస్కార్స్‌ టీమ్ పై నమ్మకం లేక వారు ఇలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని తెలుస్తోంది.