విజ‌య్ దేవ‌కొండ ఏడాది సంపాద‌న ఎంతో తెలుసా..? అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు సరైన హిట్టు ప‌డి చాలా కాలమే అయ్యింది. ఇంకా చెప్పాలంటే `గీత గోవిందం` తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయాడు. గ‌త ఏడాడి విజ‌య్ నుంచి వ‌చ్చిన `లైగ‌ర్` సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే వరుస ప్లాపులు ఎదురైనప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఈయన డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది తప్ప డౌన్ కావడం లేదు. ఇకపోతే విజయ్ దేవరకొండ ఏడాది సంపాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజ‌య్ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపధ్యంలోనే ఈయన ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి 20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నాడు. అలాగే పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

రీసెంట్ గా విజ‌య్ ప్రైమ్ వాలీబాల్ జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హ్యాక్స్ కి కో ఓనర్ గా మారారు. ఇందులో వాటాను పొందేందుకు ఆయన రూ.150కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది. మరోవైపు రౌడీ బట్టల బ్రాండ్ నుంచి కూడా గ‌ట్టిగానే ఆదాయం వ‌స్తోంది. మొత్తంగా విజయ్ ఏడాదికి రూ. 50 నుంచి 60 కోట్ల రేంజ్ లో సంపాదిస్తున్నాడని ఇన్‌సైడ్‌ టాక్ న‌డుస్తోంది. కాగా, ప్రస్తుతం విజయ్ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. అలాగే గౌతమ్ తిన్న‌నూరితో ఓ మూవీని అనౌన్స్ చేశాడు.