“మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తుంది”..మహేశ్ కి ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం..ఎవరో చెప్పుకోండి చూద్దాం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకు పరిచయమయ్యాడు . ఆ తర్వాత హీరోగా రాజకుమారుడు అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీకి లో నెట్టుకు వస్తున్నాడు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే కూలెస్ట్ హీరో ఎవరు అంటే అందరూ కళ్ళు మూసుకుని టక్కున చెప్పే పేరు మహేష్ బాబు . అంత కూల్ గా ఉంటాడు.

గొడవలకు వెళ్లడు ..కాంట్రవర్షీయల్ కంటెంట్ క్రియేట్ చేయడు.. ఒక మాట అంటే లెఫ్ట్ అండ్ రైట్ ఇచేస్తాడు కానీ ..స్వతహాగా ఆయన ఒకరిని నొప్పించడు . అదే మహేష్ బాబుకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసి పెట్టింది . కాగా సినిమాలో నటించిన ప్రతి హీరో హీరోయిన్స్ కి ఎఫేర్ అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి . అయితే ఇప్పటివరకు మహేష్ బాబు పై అలాంటి రూమర్ ఏదీ రాలేదు . దానికి మెయిన్ రీజన్ ఆయన ఇండస్ట్రీలో తనతో నటించే హీరోయిన్స్ తో చాలా దూరంగా ఉంటాడు . సీన్ అయిపోయిందా తన పని తాను చూసుకుంటూ ఉంటాడు . అంతేకానీ పబ్బులు, పార్టీలు, మీటింగులు అంటూ హీరోయిన్ తో ఓవర్ యాక్టింగ్ చేయడు.

కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ తో వర్క్ చేసిన మహేష్ బాబుకు ఓ హీరోయిన్ అంటే మాత్రం చాలా ఇష్టమట . అంతా కాదు తన ఫోటోని మొబైల్ లో సేవ్ చేసుకొని పదేపదే జూమ్ చేసి మరీ చూస్తూ ఉంటాడట ..ఆ హీరోయిన్ మరెవరో కాదు తన భార్య నమ్రత శిరోద్కర్ . మనకు తెలిసిందే నమ్రత – మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వంశీ సినిమా షూటింగ్ చేస్తున్న టైంలో ఈ జంట ప్రేమలో పడింది . కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన నమ్రత.. పెళ్లికి ముందు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసిన స్టార్ హీరోయిన్ అని అందరికీ తెలిసిన విషయమే . ప్రజెంట్ ఈ జంట ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది..!!