విక్టరీ వెంకటేష్ 75వ సినిమా నుంచి క్రేజీ అప్డేట్…!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ గత సంవత్సరం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన ఎఫ్ 3 సినిమాతో సూపర్ సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వెంకీ రానాతో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ తో పాటు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో కలిసి కీసికా భాయ్ కిసిక జాన్ అనే ఓ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాల తర్వాత వెంకటేష్ తన కెరియర్ లోనే ప్రతిష్టాత్మక సినిమా అయిన తన 75వ సినిమా గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఇటీవల అడివిశేష హీరోగా వచ్చిన హిట్2 సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను శైలేష్ కొలను తెరకెక్కించాడు.

ఇప్పుడు వెంకటేష్ 75వ సినిమాను ఈ దర్శకుడు తెరకెక్కించబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఎంతో భారీ స్థాయిలో నిర్మించబోతుందట. ఈ సినిమాలో వెంకటేష్‌కు జంటగా కేజిఎఫ్ సినిమాల ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మరి ఈ వార్తపై ఇంకా ఈ సినిమా యూనిట్ ఎటువంటి అధికార ప్రకటన ఇవ్వలేదు.