నిర్మాత చుక్కలు చూపిస్తున్న కంగనా రనౌత్.. అసలు ఏమైందంటే

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అంటేనే ఫైర్ బ్రాండ్. ఆమె తన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో ఉంటోంది. ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేస్తూ ఆమె సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంటుంది. ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా ఆమె చెబుతోంది. ఈ తరుణంలో ఎన్నో విమర్శలు ఆమె ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో పెద్దలపై ఆమె పదునైన విమర్శలతో విరుచుకు పడుతుంది. కరణ్ జోహార్, ఖాన్‌ల త్రయం ఇలా ఎందరినో తిడుతుంటుంది. మరో వైపు ఆమె తన సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితంపై తెరకెక్కిన తలైవి చిత్రం ద్వారా ఆమె ఆకట్టుకుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ప్రాజెక్టులో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. చంద్రముఖి-2 సినిమా చేయనుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో ఆమె తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

నటి కంగనా చేసే విమర్శలు ఆమెకు ఎందరినో శత్రువులను తెచ్చి పెట్టాయి. దీంతో ఆమెకు సీఆర్‌పీఎఫ్ బలగాలు నలుగురు బృందం ఎప్పుడూ ఆమె వెంట ఉంటుంది. వీరు కాకుండా ఎక్కడకు వెళ్లినా బౌన్సర్లు ఆమె వెంటే ఉంటారు. వీరితో పాటు హెయిర్ స్టైలిస్ట్, మేకప్ మ్యాన్, ఇలా వ్యక్తిగత సిబ్బంది కూడా ఆమె వెంట వస్తుంటారు. ప్రస్తుతం చంద్రముఖి షూటింగ్‌లో భాగంగా వీరంగా కంగనాతో పాటు ఉంటున్నారు.

వారికి అయ్యే ఖర్చులన్నీ చంద్రముఖిని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ వారే భరిస్తున్నారు. దీంతో నిర్మాతపై భారం పెరుగుతోంది. ఆమె పెట్టే భారీ ఖర్చుతో నిర్మాతకు చుక్కలు కనిపిస్తున్నాయని చిత్రవర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా విషయానికి వస్తే చంద్రముఖి పార్ట్ వన్‌లో రజనీకాంత్ హీరోగా నటించారు. చంద్రముఖి-2లో రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవ లారెన్స్ సరసన కంగనా ప్రధాన పాత్రలో కనిపించనుంది.