బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైమ్‌ ఇలా…వీర సింహారెడ్డి బిగ్గెస్ట్ ఓపెనింగ్ లోడింగ్..!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈసినిమా విడుదలకు ముందు నుంచే భారీ పాజిటివ్ టాక్ తో సూపర్ బాజ్‌ క్రియేట్ చేసుకుంది వీర సింహారెడ్డి.

గత రాత్రి ఇతర దేశాల్లో ప్రీమియర్ షో లతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వీర సింహారెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతుంది. ఇక రెండు షోలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా అభిమానుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు పూనకాలు తెప్పించాయి. థ‌మన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి థియేటర్లను ఊపేసాయి.

సాయి మాధవ్ బొర్రా డైలాగులు, బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో సహా ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరగటం మరో విశేషం. ఇప్పుడు దీంతో డెఫినెట్గా బాలయ్య ఈ సినిమాతో తన కెరీర్ లోనే డే1 బిగ్గెస్ట్ ఓపెనింగ్ నమోదు కానున్నట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పుడున్న టాక్ ప్రకారం చూస్తుంటే వీర సింహారెడ్డి తొలిరోజే రూ.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.