పూజా హెగ్డే మరో రకుల్‌ ప్రీత్‌ కాబోతుందా? తక్కువ సమయంలోనే?

 

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి డేట్స్ ఖాళీగా లేనంత బిజీగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కొన్నిరోజులకు మహేష్ తో ఒక సినిమా లో నటించింది. అలాంటి రకుల్ ప్రీత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమాలో కూడా కనిపించని పరిస్థితి ఇప్పుడు రకుల్ ది.

ఆమె అదృష్టం కొద్దీ హిందీలో అడపాదడపా సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి. ఐతే అవి పెద్దగా విజయం సాధించడం లేదు. దీన్నిబట్టి చూస్తే రకుల్ ప్రీత్ సింగ్ తన సినీ కెరీర్‌లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే స్టార్‌డమ్ అనుభవించింది అని అర్ధమవుతుంది. ఆ మూడు సంవత్సరాలో ఆమె స్టార్ హీరోలందరి సరసన నటించి ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం రకుల్ పరిస్థితి ఏం బాలేదు. టాలీవుడ్‌లో అసలు ఇప్పుడు ఆమెని పట్టించుకునే వాళ్లే లేరు అని పుకార్లు కూడా పుట్టుకోస్తున్నాయి.

ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇంకో హీరోయిన్‌కి కూడా పట్టేలా ఉంది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. దాదాపు రెండు సంవత్సరాలు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాలు లేక తెల్లమొహం వేసింది. రకుల్ ప్రీత్ సింగ్ లానే పూజా హెగ్డే కూడా యంగ్ హీరోలందరి సరసన నటించింది. ఇక ఇప్పుడు అవకాశాలు లేక బాలీవుడ్ వైపు చూస్తుంది. పూజా హెగ్డే ఇప్పుడు ఒక మహేష్ బాబు సినిమాలో తప్ప ఇంకో హీరో సినిమాలో కనిపించడం లేదు. దాంతో ఏంటి పూజాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఆమె ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. పూజాకి ఇంతకుముందులా స్టార్‌డమ్ రావాలని, మంచి మంచి తెలుగు సినిమాలలో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.