రాజమౌళి సినిమాలలో.. ఇష్టం లేని సినిమా అదే.. రమా రాజమౌళి..!!

టాలీవుడ్ లో దిగ్గజ దర్శకుడు డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. రాజమౌళి తెరకెక్కించి ఎలాంటి సినిమా అయినా సరే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటుంది రాజమౌళి భార్య రమా రాజమౌళి. సినిమాలోని ప్రతి క్యారెక్టర్లు ఎలాంటి కాస్ట్యూమ్స్ కావాలి అనే విషయంపై ఎప్పుడు రాజమౌళి తన భార్యతో చర్చించిన తర్వాతే ఫైనల్ చేస్తారట. వాస్తవానికి రాజమౌళి సినిమాలకి పనిచేసే వారిలో ఎక్కువ మంది అతని కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే తాజా జీవితంలో తన సక్సెస్ లో తన భార్య రమా కి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందని రాజమౌళి ఇంటర్నేషనల్ అవార్డు వేడుకలు కూడా ప్రస్తావించడం జరిగింది.

Rajamouli wife Rama does not like Jr NTR film!

తాజా విషయానికి వస్తే రాజమౌళి తెరకెక్కించిన సినిమాలలో అతని భార్య రమా రాజమౌళి కి ఒక సినిమా తనకి నచ్చలేదట. తాజాగా అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రమా రాజమౌళి ఈ విషయాన్ని తెలియజేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

యమదొంగ - వికీపీడియా

రొటీన్ కథ అయినప్పటికీ కూడా రాజమౌళి తనదైన మార్కుతో ఈ సినిమాని రాజమౌళి కనెక్ట్ అయ్యేలా చేశారు. యమదొంగ సినిమా తనకి అసలు నచ్చలేదని రమా రాజమౌళి తెలియజేసింది. అసలు తనకి ఎందుకు నచ్చలేదు అనేందుకు పెద్దగా రీజన్ చెప్పలేదు.. కేవలం ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేకపోయిందని తెలుపుతోంది. ఇందులో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో అద్భుతంగా ఉందని ఆ ఒక్క కారణంగానే ఈ సినిమా హిట్ అయిందని తెలిపింది.