రోజాపై ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన గెటప్ శ్రీను..?

టాలీవుడ్లో గతంలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించిన రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తరువాత హీరోయిన్ల క్రేజ్ తగ్గిపోయిన పలు సినిమాలలో తల్లి క్యారెక్టర్లలో నటించింది రోజా. కొన్ని సినిమాలలో నటించిన వెంటనే రాజకీయంగా కూడా ప్రవేశించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం మంత్రిగా వైసిపి పార్టీలో కొనసాగుతోంది. తాజాగా రోజా పైన బుల్లితెర కమెడియన్ గెటప్ శ్రీను పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

getup srinu fire to roja | Vaartha
బుల్లితెరపై గెటప్ శ్రీను అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగు ప్రేక్షకులకు తన కామెడీతో విభిన్నమైన గెటప్పులతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. గతంలో జడ్జిలుగా ఉన్న నాగబాబు, రోజా అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. సినిమాలలో కూడా ప్రస్తుతం పలు పాత్రలు రావడంతో సినిమాలలో నటిస్తూ ఉన్నారు గెటప్ శ్రీను. హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాజు యాదవ్ అనే సినిమాలో నటించారు. త్వరలోనే ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలోనే తాజాగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది.

Minister Roja, Getup Srinu: మంత్రి రోజాపై గెటప్ శ్రీను షాకింగ్ పోస్ట్.. ఆ  వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోమంటూ వార్నింగ్ - jabardasth srinivas aka getup  srinu strong counter to ...
మంత్రి రోజాను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే నిన్నటి రోజున చిరంజీవిని ఉద్దేశిస్తూ రోజా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.. అందుకు దీటుగా ఈ కామెంట్ల పైన గెటప్ శ్రీను రియాక్ట్ అవుతూ.. చిరంజీవి గారి సేవ గుణం, దానగుణం తెరిచిన పుస్తకం వంటిది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి మీకెందుకు కనపడలేదో రోజా గారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అంటూ ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది. మీరు అన్న వాక్యాలను దయచేసి వెనక్కి తీసుకోండి అంటూ ఫేస్బుక్లో రాసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారుతోంది.