డైరెక్టర్ల ధనవంతుల జాబితాలో రాజమౌళిది ఎన్నో స్థానం తెలుసా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ పాత్ర చాలానే ఉంటుంది.తెర వెనుక నుండి సినిమాని ముందుకు నడిపించే వారే డైరెక్టర్ అని చెప్పవచ్చు. ఇలా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగా ఆస్తులు సంపాదించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే తాజాగా జీక్యు నిర్వహించిన సర్వేలో భాగంగా అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ జాబితాలో తెలుగు సినీ పరిశ్రమ నుంచి కేవలం రాజమౌళి మాత్రమే చోటు సంపాదించారు. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

SS Rajamouli reveals if Kevin Feige approached him for Marvel movie |  Bollywood - Hindustan Times
ఈ జాబితాలో అత్యంత ధనవంతులైన డైరెక్టర్లలో మొదటి స్థానం ఎవరున్నారని విషయానికి వస్తే బాలీవుడ్లో దర్శకుడుగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు పొందిన కరణ్ జోహార్ రూ.1640 కోట్ల రూపాయల ఆస్తిని కలిగిన అత్యంత ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో రాజకుమార్ హీరోని రూ.1105 కోట్ల రూపాయల ఆస్తిని కలిగినట్లు తెలుస్తోంది. ఇక మూడవ స్థానంలో సంజయ్ లీల బన్సాలి రూ.940 కోట్లు ఆ తర్వాత అనురాగ్ కశ్యప్ రూ.720 కోట్లు.. ఆ తర్వాత స్థానంలో కబీర్ ఖాన్ రూ.300 కోట్లు కలదు.

ఇక ఆ తర్వాత ఐదవ స్థానంలో రోహిత్ శెట్టి రూ 250 కోట్ల రూపాయలు ఆస్తిని కలిగి ఉన్నారు. ఏడవ స్థానంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి రూ .200 కోట్ల రూపాయలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తర్వాత స్థానంలో రూ .76 కోట్ల రూపాయలతో జోయా అక్తర్ నిలిచారు ఇలా అత్యంత ధనవంతుల డైరెక్టర్ జాబితాలో రాజమౌళి స్థానం దక్కడం గమనార్హం.