బాలయ్య చేతికి ఉన్న ఈ వాచ్ ఎంత స్పెషలో తెలుసా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్య రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ థ‌మన్ సంగీతం అందించగా. అందాల భామ శృతిహాసన్ బాలయ్యకు జంటగా నటించింది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శుక్రవారం ఒంగోలులో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు జై బాలయ్య జై జై బాలయ్య అంటూ నినాదాలతో నందమూరి ఫ్యాన్స్ హోరెత్తించారు.

Balakrishna

అక్కడికి వచ్చిన వారి అందరి అటెన్షన్ మొత్తం ఈ ఈవెంట్‌లో బాలయ్య వేసుకున్న డ్రెస్ పై, వాచ్ పైనే ఉంది. ఆ వాచ్ ఎంతో ఖరీదైన దానిలా కనిపిస్తుంది. ఆయన చేతికి పెట్టుకున వాచ్ కలర్ బ్లాక్.. ఇక వాచ్ బ్రాండ్ అయినా క్రాటియర్ ఈ వాచ్ ధర దాదాపు 24,40,000 ఉంటుందని తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు బాల‌య్య ఇంత‌ విలువైన వాచ్ పెట్టుకున్నాడా ? అని ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాకుండా ఈ వాచ్ అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమట. అందుకే ఈ వాచ్ ను తాను స్పెషల్ గా భావించిన సందర్భాల్లోనే ధరిస్తూ ఉంటాడట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ఆయన కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని ఆయన పుట్టినరోజుకు గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బాలయ్య అభిమానులు ఈ వాచ్ విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.