బుల్లితెర‌పై `బింబిసార‌` బీభ‌త్సం.. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ రేటింగ్‌!

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం `బింబిసార`. శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై కె. హ‌రికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్, కీర‌వాణి స్వ‌రాలు అందించాడు.

ట్రైమ్‌ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోషియో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం గ‌త ఏడాది ఆగస్టు 5న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం.. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన చిత్రంగా బింబిసార రికార్డు సృష్టించింది.

అయితే తాజాగా బుల్లితెర‌పై సైతం బింబిసార బీభ‌త్సం సృష్టించింది. ఈ చిత్రం జనవరి 8న `జీ తెలుగు`లో వరల్డ్ ప్రీమియర్ గా ప్రసారం అయ్యింది. టీవీ ప్రేక్షకుల నుంచి సైతం బింబిసార‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే ఈ సినిమాకు ఏకంగా 11.46 రేటింగ్ వచ్చింది. దీంతో కళ్యాణ్ రామ్ కేరీర్ లోనే హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ రాబట్టిన మొట్టమొదటి చిత్రంగా బింబిసార రికార్డు క్రియేట్ చేసింది.