ఈ సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రూ.100 కోట్ల కలెక్షన్ క్లబ్ లోకి దూసుకుపోతుంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ తర్వాత బాలకృష్ణతో సినిమా కు కమిట్ అయ్యాడు.
ముందుగా బాలకృష్ణ కోసం ఒక రియల్ ఇన్సిడెంట్ తో కూడిన ఓ స్టోరీని తీసుకుని సినిమా చేయాలని భావించాడు. దానికోసం పల్నాటి ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ సంఘటలను మరియు అప్పటి నేరాలకు సంబంధించి అధ్యాయం చేయడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే గోపీచంద్ పాత పేపర్లను తిరగేసిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ గా మారాయి.
ఆ కథలో బాలకృష్ణ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని చూపించబోతున్నట్లుగా టాక్ కూడా నడిచింది. కానీ కథ మొత్తం పూర్తి అయిన తర్వాత బాలకృష్ణకు కథ చెప్పడంతో ఆయనకు నచ్చలేదట. దాంతో తర్వాత తన వద్ద ఉన్న ఫ్యాక్షన్ స్టోరీని గోపీచంద్ బాలకృష్ణకు చెప్పడంతో ఆయన ఓకే చేశాడు. అదే వీరసింహారెడ్డి అని తెలుస్తుంది.
అయితే బాలకృష్ణ ఈ కథ కాకుండా క్రాక్ మాదిరిగా నిజ సంఘటనలతో కూడిన ఆ కథను చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమాకు మించి డబుల్ సక్సెస్ ఆయన దక్కించుకునే వారంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని దర్శకుడు చెప్పిన మొదటి కథ వర్కౌట్ అవ్వక పోయేదేమో అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి గోపీచంద్ మలినేని ఆ కథను తన వద్ద ఉంచుకున్నాడు. మరి ఆ స్టోరీనీ ఎవరితో సినిమా చేస్తాడో అనేది చూడాలి.