వామ్మో, రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ ధర అంత ఖరీదా..

మెగా నటుడు రామ్ చరణ్ టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో మెగా హీరో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ రేంజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఉపాసన తల్లి కాబోతుందన్న వార్త విని ఇంకా సంతోషపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ మొదటినుండి స్టైలిష్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చరణ్ ఉపయోగించే వాచ్ లు, షర్ట్స్ ధర ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. అలానే అతని భార్య ఉపాసన కూడా ఏమాత్రం రామ్ చరణ్ రేంజ్ కి తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటారు.

ఇటీవలే ఉపాసన ధరించిన రెడ్ కలర్ డ్రెస్ విలువ లక్షకు పైనే ఉంటుందట. అది విని అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ సెమీ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. మెగా కజిన్స్ అందరూ కలిసి సెమీ క్రిస్మస్ వేడుకను సరదాగా జరుపుకున్నారు.

ఈ వేడుకలోని ఫోటోలు గత రెండు రోజుల నుండి తెగ వైరల్ అవుతున్నాయి. ఆ వేడుకలో అందరి దృష్టి చరణ్ వేసుకున్న షర్ట్ పైనే ఉంది. దాంతో ఆ షర్ట్ ధర తెలుసుకోడానికి తెగ ఆరాటపడిపోయారు, ఇక ఆ షర్ట్ ధర తెలిసిన తరువాత అందరూ నోరెళ్లబెట్టారు. అసలు ఆ షార్ట్ ధర అక్షరాలా రూ.1,21,840. ఈ లైట్ బ్లూ కలర్ షార్ట్ పై ప్యాచ్ డీటెయిల్ వర్క్‌తో డిజైన్ చేయబడి ఉంది. ఈ షర్ట్ బ్రాండ్ వచ్చేసి జున్యా వతనాబే అని సమాచారం.

ఈ షర్ట్ ధర తెలిసిన తరువాత చరణ్ అభిమానులు వామ్మో ఒక షర్ట్ ధర లక్షా పాతిక వేల హా అని ఖంగుతింటున్నారు. కొంతమందేమో ఒక మిడిల్ క్లాస్ యువకుడి నాలుగు నెలల జీతం అది అని అంటున్నారు. మరి కొంతమందేమో కాస్ట్ ఎంతయినా కానీ ఆ షర్ట్ చరణ్ కి చాలా బాగుంది అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నేటింట వైరల్ అవుతున్నాయి.