హవ్వ..48 వయసులో కుర్ర బ్యూటీతో డేటింగ్ చేస్తున్న స్టార్ హీరో.. పబ్లిక్ గానే ముద్దులు..!

లియోనార్డో డికాప్రియో పరిచయం అవసరం లెన్ని పేరు. చాక్లెట్ బోయ్ అనే పేరుకి అయ‌న‌ పర్యాయపదం . 20 ఏజ్ లో అతడి లుక్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫాలోయింగ్ వ‌చ్చింది. ఇప్పటికీ అత‌నీ టైటానిక్ హీరో జాక్ గా అమ్మాయిల హృదయాల్లో నిలిచిపోయాడు. టైటానిక్ లో క్యాట్ విన్ స్లెట్ తో అతడి ప్రేమ కథ.. రొమాన్స్‌ ఇప్పటికీ యువతరం మర్చిపోలేదు. ఇప్పుడు హాలీవుడ్ లో సీనియర్ నటులలో ఒకడిగా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు.

Leonardo DiCaprio rumoured to be dating model who wasn't even born when  Titanic was released

సినిమాల పరంగా హాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న.. తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ వివాదాలతో అమ్మాయిలతో డేటింగ్ వ్యవహారాలతో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. లియోనార్డో ఇప్పుడు మరోసారి సోష‌ల్ మీడియ‌లో హ‌ట్ టాపిక్ గా మారాడు . తన కంటే పాతికేళ్ల చిన్న వయసు ఉన్న హీరోయిన్ విక్టోరియా లామాస్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

విక్టోరియా లామాస్ `ఫాల్కన్ క్రెస్ట్` నటుడు లోరెంజో లామాస్ కుమార్తె. ఈమె మంగళవారం ఒక విందు కార్యక్రమంలో లియోనార్డోతో కనిపించింది. వెంటనే వారిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే ఇలా కలిసి డిన్నర్‌ను ఆస్వాదించారు అంటూ వారి సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

Viral graph shows Leonardo DiCaprio's crazy age criteria

లియొనార్డో డికాప్రియో విషయానికి వస్తే ఇటీవలే అతడు తన ప్రేయసి కెమిలా మోరోన్‌కు బ్రేకప్‌ చెప్పాడు. ప్రస్తుతం అతడు మోడల్‌ గిగి హాడిడ్‌తో లవ్‌లో ఉన్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌ పార్టీలో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఆ వార్త‌ల‌కు మరింత బలం చేకూరినట్లైంది. లియొనార్డో ఈ డేటింగ్ వార్తలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు.