వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూ ఫిక్స్..!?

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన 2023లో వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో శృతి హాసన్ బాలయ్య బాబుతో జత కట్టింది. ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించాడు. దునియా విజయ్‌తో పాటు లాల్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు ఈ మూవీని రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న వేళ “మా బావ మనోభావాలు” అంటూ సాగే ఓ ఐటమ్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ బాగా క్లిక్ అయింది. మరోవైపు వీర సింహా రెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్రిపరేషన్లు జరిగిపోతున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం భాగంగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఒంగోల్‌లో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఇదే ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

బాలకృష్ణ కెరీర్‌లో వీరసింహారెడ్డి మూవీ 107వ సినిమాగా రిలీజ్ అవుతుంది. బాలకృష్ణతో తమన్ కలిసి పనిచేసే మూడవ మూవీ కూడా ఇది అవుతుంది. ఇక గోపీచంద్ మలినేని, తమన్‌ కాంబో ఈ సినిమాతో ఆరోసారి రిపీట్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి జై బాలయ్య, సుగుణ సుందరి రిలీజ్ కాగా రీసెంట్‌గా మా బావ మనోభావాలు పాటను రిలీజ్ చేశారు. అఖండ సినిమా వలె ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.