టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న ఆషికా.. ఎవరీ ముద్దుగుమ్మ ..?

కన్నడలో పదికిపైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆషికా రంగనాథ్ ఇప్పుడు టాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అమిగోస్’ సినిమాతో తెలుగు వారికి పరిచయం కాబోతోంది. ఈ మూవీలో ‘ఇషిక’ క్యారెక్టర్‌లో ఈ తార ఎంట్రీ ఇవ్వనుంది. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఆషిక క్యూట్ లుక్స్‌తో కనిపించింది అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. లాస్ట్ స్టేజీలో షూటింగ్ ఉందని, ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందని వెల్లడించాడు. 2023, ఫిబ్రవరి 10న మూవీ రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే ఈ మూవీ హీరోయిన్ క్యూట్ గా ఉండటంతో ఆమె ఎవరో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చెబుతున్నారు. మరి ఆమె ఎవరో తెలుసుకుందామా..!

 

ఆషిక కర్ణాటకలోని హాసన్ జిల్లాలో రంగనాథ్, సుధా రంగనాథ్ దంపతులకు కన్నడ కుటుంబంలో జన్మించింది. ఆమె అక్క అనూషా రంగనాథ్ కూడా నటి. చదువు కోసం బెంగుళూరుకు వెళ్లిన ఆషిక అక్కడ క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో ఆడిషన్ చేసింది. ఆ మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నరప్‌గా నిలిచింది. ఆపై ఫ్రీస్టైల్, బెల్లీ, వెస్ట్రన్‌తో సహా పలు డ్యాన్స్‌ల్లో శిక్షణ పొందింది. ఆపై నటనా రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమా ద్వారా బిగ్గెస్ట్ ప్రొడక్షన్‌లో తెలుగు తెరకి పరిచయం అవుతుంది.

ఇకపోతే అమిగోస్ సినిమాకి సాంకేతిక బృందం గురించి తెలుసుకుంటే.. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.