ఆ ఒక్క మిస్టేక్ లేక‌పోతే ఆంధ్రావాలా బ్లాక్‌బ‌స్ట‌రే అయ్యేదా…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో అనుకునంత గుర్తింపు తెచ్చుకొని తారక్.. తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్, ఆది వంటి సినిమాలతో టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ కెరియర్ ని మలుపు తెప్పిన సినిమాలలో సింహాద్రి సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్నా రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

Watch Simhadri Movie Online for Free Anytime | Simhadri 2003 - MX Player

ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మరో లెవ‌ల్‌కి వెళ్ళింది. ఆయన తర్వాత సినిమాలపై కూడా భారీ ఎక్స్ ప్రెస్టేషన్‌లు నెలకొన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్టు ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్- పూరి జగన్నాథ్ సినిమాలో తొలిసారి ద్విపాత్ర అభినయం చేశాడు. ఆ సినిమాలు ఎన్టీఆర్‌కు జంటగా రక్షిత నటించింది. ఆ సినిమాకు ఆంధ్రావాల అనే టైటిల్ పెట్టి 2004లో భారీ అంచనాల న‌డుమ‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్క బార్ల పడింది.

Andhrawala telugu | Sun NXT

ఆ సినిమాలో ఎన్టీఆర్ నటన మ్యూజిక్ బాగున్నా అభిమానులు ఊహించుకున్న రేంజ్ లో ఈ సినిమా లేకపోవడంతో వారికి నిరాశ మిగిల్చింది. తన కెరియర్ లో తొలిసారి డ్యూయల్ రోల్ చేసిన ఆ సినిమాకి వర్కౌట్ అవలేదు. నందమూరి టైగర్ హరికృష్ణ కొడుకుగా ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో అదిరిపోయే మార్కెట్ ఉంది. అప్పటికి హరికృష్ణ కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఆంధ్రావాలా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎన్టీఆర్ నటించడం కన్నా హరికృష్ణ ఆ పాత్రలో నటించి ఉంటే ఆ సినిమా ఫలితం మరోలాగా ఉండేదని అప్పుడు ఉన్న ట్రేడ్ వర్గాలు కూడా భావించాయి.

నందమూరి అభిమానులకు కూడా తండ్రీ కొడుకులని ఒకేసారి తెరపై చూసుకునే అవకాశం దక్కేది. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్టీఆర్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. ఇక ఇదే కథతో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన వీర కన్నడియన్ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.