ఆ హీరోయిన్ తో ధన్య బాలకృష్ణ కి అందుకే గొడవ అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సహాయక పాత్రలలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో తరచూ పలు వివాదాలు తల దూర్చడం వల్ల వైరల్ గా మారుతోంది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం వల్ల వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇటీవల కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ధన్య బాలకృష్ణ గురించి పది సంచలన విషయాలను తెలియజేసింది.

Kalpika Ganesh : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న మహేశ్ హీరోయిన్..ఆల్రెడీ వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న ఒక కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ను ధన్య రెండో వివాహం చేసుకుందని వీరి వివాహమై ఇప్పటికి ఏడాది కావస్తున్న ఈ విషయాన్ని ఎక్కడ తెలియకుండా రహస్యంగా కాపురం చేస్తున్నారని ఒక వీడియోని విడుదల చేసింది. అయితే ఈ విషయం కాపీ రైట్స్ కారణంగా యూట్యూబ్లో ఈ విషయాన్ని డిలీట్ చేసింది కల్పిక. కల్పిక కోప్పడి నీ గురించి ఎన్నో విషయాలు బయట చెప్పేసరికి ఇన్ని రోజులు నా నెంబర్ బ్లాక్ లో ఉంచావు ఈరోజు రాత్రి అన్ బ్లాక్ చేసి వరుసగా కాల్ చేస్తున్నావ్ ?భయపడ్డావా ? లేక నన్ను భయపెట్టాలనుకుంటున్నావా.? నీ పవర్ చూపించి నేను షేర్ చేసిన వీడియోని యూట్యూబ్ లో లేకుండా చేశావు కదా..! నా పవర్ ఏంటో చూపిస్తాను అంటూ కామెంట్లు చేయడమే కాకుండా త్వరలోనే కోర్టులో కలుద్దాం అంటూ కల్పిక గణేష్ సవాల్ విసిరుతోంది.

దీంతో వీరి వ్యవహారం ఇటు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారుతోంది .ఈ నేపథ్యంలోనే ధన్య బాలకృష్ణ కల్పిక పై తీర స్థాయిలో మండిపడుతూ.. కల్పిక ఒక పెద్ద తాగుబోతని ,స్మోకింగ్ కూడా ఎక్కువగా చేస్తుందని.. ఇతరత్రా అలవాట్లు ఉన్నాయని.. కోలీవుడ్ మీడియాతో తెలియజేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ధన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.