పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న నమ్రత.. ఆ వీడియో వైరల్!

సినిమా ఇండస్ట్రీలోని రీల్ లైఫ్ కపుల్స్ కాస్త రియల్ లైఫ్ కపుల్స్ అవుతుంటారు. ఏదైనా ఒక సినిమాలో నటించే సమయంలో అభిప్రాయాలూ కలిసి రియల్ లైఫ్ లో వీరు జంటలుగా మారిపోతున్నారు. ఆ కోవకు చెందిన వారే మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్. వంశీ అనే సినిమాలో నటించిన వీరు ఆ సమయంలో ప్రేమలో పడి పెద్దలను అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జంటని క్యూట్ కపుల్ అని పిలుస్తారు.

నమ్రత ఇండస్ట్రీలోకి రాకముందు 1993 మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొంది. ఆ పోటీలకు సమందించిన ఒక వీడియోని తాజాగా నమ్రత సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ వీడియోని చూసి నమ్రత సోదరి శిల్ప ‘మేం గర్వపడేలా చేసావ్’ అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ అందాల పోటీలో నమ్రత నడిచిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో చూసి ఘట్టమనేని అభిమానులు కామెంట్లతో తెగ పొగిడేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

ప్రస్తుతం నమ్రత మహేష్ బాబు బిజినెస్ లను చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాన్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా పూర్తయిన తరువాత రాజమౌళి దర్శకత్వం లో నటించబోతున్నాడు మహేష్ బాబు.