బిగ్ బాస్ కి నాగార్జున గుడ్ బై చెప్పినట్టేనా..?

మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ షోని హిందీ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. చెప్పాలంటే ఆదరిస్తూనే ఉన్నారు. అలాంటి బిగ్ బాస్ షోను మొట్టమొదటి సారిగా తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్ గా మొదలుపెట్టారు. అయితే ఒక్క సీజన్కే ఎన్టీఆర్ గుడ్ బాయ్ చెప్పి వెళ్లిపోయారు. ఇక రెండవ సీజన్ కి నాని హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే . కానీ నాని కూడా ఎక్కువ సీజన్లో ఉండలేదు. ఒక సీజన్ కే చేతులెత్తేశాడు. ఇక మూడవ సీజన్ కి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే కొన్ని సీజన్లో చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు కూడా ఆయనే హోస్ట్ గా కొనసాగుతున్నాడు.

Nagarjuna unveils Bigg Boss Telugu 6 promo, promises complete  entertainment. Watch - India Today

అయితే ఇక ఏడవ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించేందుకు ఆసక్తి చూపటం లేదట. ఎందుకంటే ఆయన సినిమాలకు అన్యాయం చేస్తున్నానని దాదాపుగా నాలుగు నెలల నుండి బిగ్ బాస్ షో వల్ల సినిమా షూటింగ్ కి ఇబ్బంది అవుతోంది. అందుకని బిగ్ బాస్ ని వదిలి పెట్టాలనే నిర్ణయానికి వచ్చాడని తెలుస్తోంది.

వచ్చే సీజన్ కి కొత్త హోస్ట్ ఎంపిక కోసం నిర్వాహకులు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. యంగ్ హీరోల నుంచి అగ్ర హీరోల వరకు వెతుకుతూనే ఉన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఇలా చాలామంది పేర్లను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో ఎవరు ఆసక్తి గా ఉన్నారు. నిర్వాహకులు ఎవరికి ఓటు వేస్తారు. అనేది చూడాలి. బిగ్ బాస్ కు తెలుగులో ఒక వర్గం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. మంచి హోస్ట్ తో మంచి కంటెస్టెంట్ తో షో నీ రన్ చేస్తే మాత్రం కచ్చితంగా భారీ రేటింగ్ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కి నాగార్జున కంటిన్యూ చేస్తారో లేదా ఏ అగ్ర హీరో అయినా వస్తాడో లేదా యంగ్ హీరో వస్తారో వెయిట్ చేయాల్సిందే.