అంధురాలిగా మారనున్న రష్మిక.. ఆ సినిమా కోసమే..

 

ప్రముఖ నటి రష్మిక తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాలలో నటించింది. ఇటీవలే విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో కూడా నటించి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి లెక్కలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

పుష్ప సినిమా తరువాత రష్మిక వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది. ఈ అమ్మడు సినిమాలోనే కాకుండా వెబ్ సిరీస్‌లో కూడా నటించి అభిమానులను అలరిస్తోంది. తాజాగా రష్మిక తదుపరి సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మిషన్ మజ్ను అనే సినిమాలో నటిస్తుంది రష్మిక. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో రష్మిక కళ్ళు లేని అంధురాలి పాత్రలో నటిస్తుందని సమాచారం. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 20న ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

మిషన్ మజ్ను సినిమాలో రష్మిక అంధురాలి పాత్రలో కనిపించనుంది. ఇలాంటి పాత్రలో ఆమె నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో రష్మిక క్యారెక్టర్ కీలక పాత్ర పోషిస్తుందట. అయితే హీరోయిన్‌గా చూసిన రష్మికను అంధురాలి పాత్రలో ప్రేక్షకులు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. అయితే మిషన్ మజ్ను సినిమా ఎపుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా థియేటర్స్ వస్తుంది అని కొంతమంది అంటున్నారు. కానీ ఈ సినిమాని ఓటీటీలోనే డైరెక్టర్‌గా విడుదల చేయనున్నారు. త్వరలోనే మిషన్ మజ్ను సినిమా ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు.