బాక్సాఫీస్ వ‌ద్ద `ధ‌మాకా` దుమారం.. మొదటిరోజు కంటే 3వ రోజే ఎక్కువ క‌లెక్ష‌న్స్‌!

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ధ‌మాకా`. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది.

దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దుమారం రేపుతోంది. మొదటిరోజుకు మించి 3వ రోజు వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం మ‌రో విశేషం. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.50 కోట్ల షేర్ వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 3.53 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది. అయితే మూడో రోజు సండే కావ‌డంతో.. ధ‌మాకా ఏకంగా రూ. 5.18 కోట్ల రేంజ్‌లో షేర్ ను వ‌సూల్‌ను అల్ల‌క‌ల్లోలం సృష్టించింది. ఇక ఏరియాల వారీగా ధ‌మాకా మూడు రోజుల‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 6.00 కోట్లు
సీడెడ్: 2.25 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.68 కోట్లు
తూర్పు: 73 ల‌క్ష‌లు
పశ్చిమ: 60 ల‌క్ష‌లు
గుంటూరు: 90 ల‌క్ష‌లు
కృష్ణ: 79 ల‌క్ష‌లు
నెల్లూరు: 43 ల‌క్ష‌లు
———————————————-
ఏపీ+తెలంగాణ‌= 13.37 కోట్లు(22.80 కోట్లు~ గ్రాస్)
———————————————-

క‌ర్ణాట‌క+రెస్టాఫ్ ఇండియా : 1.10 కోట్లు
ఓవ‌ర్సీస్ : 90 ల‌క్ష‌లు
—————————————–
టోటల్ వరల్డ్ వైడ్= 15.37 కోట్లు(27.30 కోట్లు~ గ్రాస్)
—————————————–

కాగా, రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి ఈ చిత్రం.. మూడు రోజుల్లోనే రూ. 15.37 కోట్లు రాబ‌ట్టేసింది. ఇంకా రూ. 3.63 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.