`హిట్ 2` బ్యూటీ అందాల అరాచ‌కం.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హరియాణాలోని జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. `ఇచ్చట వాహనములు నిలపరాదు` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది.

ఈ సినిమా ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. అయితే రీసెంట్గా విడుదలైన `హిట్ 2` సినిమాతో మీనాక్షి చౌదరికి కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. అడివి శేష్‌ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది.

వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై నాని నిర్మించిన ఈ సినిమాలో రావు రమేశ్, సుహాస్ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో నటించారు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

మీనాక్షి చౌదరికి ఈ సినిమాతో మంచి బ్రేక్ లభించింది. అయితే ఆన్ స్క్రీన్ పై ఎంతో పద్ధతిగా కనిపించిన మీనాక్షి.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం క్లీవేజ్ షోతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. జీన్స్ ప్యాంట్‌, ట్రెండీ టాప్ లో ఒంపుసొంపులు పోతూ హాట్ హాట్ గా ఫోటోలకు పోజులు ఇచ్చింది.

మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీనాక్షి అందాలకు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు.. ఆమె తాజా పిక్స్‌పై లైకులు, కామెంట్ల వ‌ర్షం క‌రిపిస్తున్నారు.