గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడ్డారంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుంటే.. మెగా పవర స్టార్ రామ్‌చరణ్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ మూవీతోనే సల్మాన్, పూజా హెగ్డేల మధ్య పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసిందంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ కూడా చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే తాజాగా సల్మాన్ తో పూజా హెగ్డే రిలేషన్ బట్టబయలు అయింది.
సల్మాన్ స్నేహితుడు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇలాంటి బాధ్యతారహితమైన వార్తలు వ్యాప్తి చేసేవారు కాస్త సిగ్గుపడాలన్నారు. సల్మాన్‌కి, పూజా కూతురు లాంటిదన్నారు. వాళ్లిద్దరు కలిసి సినిమాల్లో నటిస్తే రూమర్లు వ్యాప్తి చేస్తారా అంటూ మండిపడ్డారు. కొంత మంది మూర్ఖులు పబ్లిసిటీ కోసమే ఇలాంటి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారని.. అంతేగానీ అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.