అప్పట్లోనే మృగ‌రాజులో సింహం కోసం ఎంత ఖర్చు పెట్టారో.. తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే..!

స్వయం కృషితో సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. తన సినిమాలు కోసం అభిమానులు ఎదురు చూసేలా తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఆయన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

 

ఈ క్రమంలోనే చిరంజీవికి చూడాలని ఉంది సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్.. తర్వాత చిరంజీవితో మృగరాజు సినిమా తీసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాను గుణశేఖర్ అడవి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించాడు.

chiranjeevi mrugaraju movie

ఈ సినిమాలో చిరంజీవి సింహంతో ఫైటింగ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా కోసం చిరంజీవి దాదాపు 150 రోజులకు పైగా డేట్స్ కూడా ఇచ్చాడు.ఈ సినిమాలో చిరంజీవికి జంటగా సిమ్రాన్, సంఘవి నటించారు. మెగా బ్రదర్ నాగబాబు ఒక కీల‌క‌ పాత్రలో నటించారు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాలో సింహం కోసమే చాలా వ‌ర‌కు ఖర్చు పెట్టారట. చిరంజీవితో దాదాపు ఆరు హిట్ సినిమాలు తీసిన కె దేవి వరప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ప‌క్షులు, జంతువులు కీలక పాత్ర లో నటించి హిట్ కొట్టిన సినిమాలు | tollywood  hit movies with animals and birds as lead names, rajandrudu gajendrudu ,  shahsa veeraudu sagara kanya , mrugaraju , eega ...

అయితే ఈ సినిమా కోసం హాలీవుడ్ లో నటించిన జాక్ అనే సింహంని ఈ సినిమా కోసం తిసుకువ‌చ్చారు. ఇక సింహంతో చిరంజీవి దాదాపు 26 రోజులు పాటు షూటింగ్ చేసారు. ఈ సినిమా కోసం చిరంజీవి రోజుకు 20గంటలపాటు కష్టపడ్డారు. అయితే ఈ సినిమాలో చాయ్ వాలా సాంగ్ మిన‌హ‌, సినిమా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమాలో సింహం కోసం దాదాపు 67లక్షలకు పైగా బడ్జెట్ పెట్టారంట.