హీరోయిన్ నిజస్వరూపం బట్టబయలు..పెళ్ళైన‌ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం…!

టాలీవుడ్ లో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోయిన్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ ధన్య‌బాలకృష్ణ. తెలుగులో నేను శైలజ, జయ జానకి నాయక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలు ఆమె చెప్పిన డైలాగులు ఇప్పటికీ కూడా మనకు వినిపిస్తూనే ఉంటాయి. వాటితో పాటు రీసెంట్‌గా రిలీజ్ అయినా అల్లుడుగారు, లూసర్, రెక్కీ వంటి పలు వెబ్ సిరీస్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది.

Actress dhanya balakrishna Shows us how to pose for a perfect  pout-ధన్యబాలకృష్ణ గ్లామరస్ ఇమేజస్

అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ గురించి షాకింగ్ విషయం ఒక‌టి బయటకు వచ్చింది. ధన్య‌ ఓ స్టార్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. వీరు పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం కూడా కావస్తుందట. అయితే ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయం గురించి టాలీవుడ్ నటి కల్పిక గణేష్ ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ధన్య‌బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో పెళ్లి చేసుకుంది.

ఆమె ఖాళీ సమయం దొరికినప్పుడల్లా చెన్నై వెళితే బాలాజీ మోహన్‌తోనే ఉండేదని క‌ల్పిక‌ చెప్పుకొచ్చింది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్ళై భార్యకు విడాకులు కూడా ఇచ్చాడని, తర్వాత‌ ఈమేను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారని ఆమె చెప్పింది. అంతే కాకుండా ఆమె నటించిన సినిమా ప్రమోషన్స్ టైం లో కూడా వాటికి రాకపోవడానికి కారణం ఇదే కావచ్చు అంటూ ఆమె ఆ వీడియోలో చెప్పుకొచ్చింది.

Upcoming Actress Dhanya Balakrishna Latest Photo Shoot - AtozCineGallery

అయితే వారు పెళ్లి చేసుకున్న విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకోవడం లేదని, కానీ ధన్య గురించి తనకు కొంత భయం ఉండేది. అతడు ఆమెను టార్చర్ చేస్తాడేమో అని అనుకున్నాను కానీ వారు ఇప్పుడు ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉంటున్నారని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest