Dhamka: శ్రీ లీలతో రవితేజకు అదృష్టం కలిసొచ్చిందా..!!

టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరు పొందారు రవితేజ ఎన్నో ఫ్లాప్ల తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సంవత్సరం వరుసగా ఖిలడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలతో భారీ డిజాస్టర్ నే చవిచూశారు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడ్డారు.ఈసారి ఎలాగైనా సక్సెస్ కావాలని రవితేజ కసితో ధమాకా చిత్రంలో నటించారు. ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కించారు. నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించారు.

Dhamaka Movie Twitter Review: ధమాకా ట్విట్టర్ రివ్యూ | Ravi Teja's Dhamaka  Movie Twitter Review in Telugu

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే రవితేజ ఇందులో రెండు పాత్రలలో కనిపించారు. ఈ రెండు పాత్రల చుట్టూ కథ నడుస్తూ ఉంటుంది. స్వామి క్యారెక్టర్ లో రవితేజ ఒక మురికివాడలో నివసించే పేద ఉద్యోగం లేని మాస్ పాత్రలో కనిపించారు. మరొక పాత్రలో ఆనంద్ చక్రవర్తి అనే మల్టీమీలిగా కనిపించారు. ఈ కంపెనీని కొంతమంది ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంటారు.. ఈ విషయంలో డ్యూయల్ రోల్ చేసిన రవితేజ ఏం ప్లాన్ చేస్తారు ఎలా తమ కంపెనీని కాపాడుకుంటారు అనేది ఈ కథ.

Dhamaka Second Day Advance Booking Report - Sacnilkమాస్ కథ కావడంతో రవితేజ పర్ఫెక్ట్ గా అదరగొట్టేసారని కామెంట్లు వినిపిస్తున్నాయి తనదైన మార్కుతో కామెడీ టైమింగ్ తో బాగానే ఆకట్టుకున్నారు. రొటీన్ కథ కామెడీ అనిపించిన ఇందులో శ్రీ లీల రవితేజ జోడి అద్భుతంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. తనికెళ్ల భరణి జయరాం ,సచిన్ తదితరులు ఇందులో అద్భుతంగా నటించారు. ఎట్టకేలకు రవితేజకు ధమాకా చిత్రంతో శ్రీ లీల వల్ల మంచి విజయం అందుకున్నారని శ్రీలీల అభిమానులు సైతం భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో ప్లాపుల తర్వాత రవితేజకు మళ్ళీ శ్రీ లీల వల్ల అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. మరి ఎంతటి కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.