లూజ్ వెధవ అంటూ కైకాలపై కోప‌డ్డ ఎన్టీఆర్.. కార‌ణం ఏంటో తెలుసా?

లెజెండీ నటుడు కైకాల సత్యనారాయణ(87) నేటి తెల్ల‌వారుజామున తుది శ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటివద్దే చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. దీంతో సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం తీరక ముందే టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. కైకాల మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

`సిపాయి కూతురు` చిత్రంతో కైక‌ల సినీ ప్రియాణం మొద‌లైంది. దాదాపు ఆరు ద‌శాబ్దాల పాటు ఆయ‌న న‌టుడిగా ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇక‌పోతే కైకాల సత్యనారాయణ, ఎన్టీఆర్ మధ్య ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. అస‌లు కేక‌ల‌సినిమాల్లోకి రావడానికి కారణం.. ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలు ఉండటమేనట. ఎన్టీఆర్ కు కైక‌ల ఎన్నో సార్లు డూప్‌గా కూడా చేశారు. ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. నటనలోనే కాదు.. రాజకీయ రంగంలో కూడా కేకాల ఆయనతో కలిసి అడుగులేశారు.

తెలుగుదేశం పార్టీ స్థాపనలో కైక‌ల‌ కూడా కీల‌క పాత్ర‌ను పోషించారు. అయితే పార్టీ పెట్టాక ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కైకాల‌ను ఎన్టీఆర్ అడిగార‌ట‌. కానీ ఆయ‌న‌కు కుదర‌క‌పోవ‌డం వ‌ల్ల నెక్స్ట్ టైం పోటీ చేస్తాను అన్నయ్య అని చెప్పార‌ట‌. ఆ తర్వాత అవుట్ డోర్ లో ఉండడం వల్ల రెండో సారి కూడా ఎలక్షన్ లో పోటీ చేయ‌లేక‌పోయార‌ట‌. దాంతో `బుద్దుందేంట్రా లూజ్ వెధవ.. ఎందుకు మిస్ అయ్యావ్.. ఈ పాటికి మంత్రి అయి ఉండేవాడివి` అంటూ కైకాల‌పై ఎన్టీఆర్ చిరు కోపం వ్య‌క్తం చేశార‌ట‌. దాంతో `పోనిలే అన్నయ్య బ్యాడ్ లక్` అని కైకాల చెప్పార‌ట‌. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాక‌పోయినా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ కైకాల ఎన్టీఆర్ కు అన్ని సంద‌ర్భాల్లోనూ తోడుగా నిలిచారు.