మ‌త్తు క‌ళ్ల‌తో మ‌తిపోగొట్టిన అనుప‌మ‌.. చీర‌తో ఏముంది రా బాబు!

అందాల భామ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న అనుపమ.. రీసెంట్ గా `కార్తికేయ 2` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ను ఖాతాలో వేసుకుంది.

తాజాగా `18 పేజెస్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ ఫీల్ గుడ్‌ లవ్ ఎంటర్టైనర్ లో నిఖిల్‌ హీరోగా నటించాడు. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోషల్ మీడియాలో ఇటీవల సూపర్ యాక్టివ్ అయిన అనుపమ గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంది.

తాజాగా చీరలో అందంగా ముస్తాబై దర్శనమిచ్చింది. ఓవైపు వయ్యారాలు పోతున్న నడుమును చూపిస్తూనే.. మరోవైపు మత్తు కళ్ళతో మతి పోగొట్టే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం అనుపమ తాజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూస్తే చీరలో ఏముంది రా బాబు అన‌కుండా ఉండలేరు. అంత అందంగా అనుపమ ఎట్రాక్ట్ చేస్తోంది.