అనుపమ అందాలకు ఫిదా..నిండైన చీరలో కుర్ర హీరోయిన్

మలయాళంలో ప్రేమమ్ సినిమాతో తెలుగు వారిని కూడా ఆకట్టుకున్న హీరోయిన అనుపమ. ఈ చిన్నదాన్ని తెలుగు తెరకు త్రివిక్రమ్ పరిచయం చేశారు. ‘అ..ఆ..’ చిత్రంలో హీరోయిన్ నితిన్ మరదలిగా తన నటనతో అనుపమ ఆకట్టుకుంది. తాజాగా కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. చందు మొండేటి డైరెక్షన్ లో కార్తికేయ2 సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీకృష్ణుడి గురించి అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశాలను అందించారు.

సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ సినిమా ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో ఈ సినిమా యూనిట్ తో దిగ్గర దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాడు. అనుపమ పరమేశ్వరన్ మలయాళీ అమ్మాయి అయిన అనుపమ తెలుగు చక్కగా మాట్లాడుతోంది. తన హావభావాలతో, నటనతో అచ్చ తెలుగు అమ్మాయిలో కనిపిస్తుంది. అందుకే ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో అనుపమ పరమేశ్వరన్ ఇప్పటి వరకూ హీరో శర్వానంద్ తో శతమానం భవతి, హీరో రామ్ తో హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఓ వైపు సినిమాలు చేస్తూ మరో వైపు సోషల్ మీడియాలో ఈ యువ హీరోయిన్ యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన స్టిల్స్ ను, ఫోటో షూట్ ను నెట్టింట ఉంచుతూ ఫ్యాన్స్ కు చేరువవుతోంది.

తాజాగా అనుపమ తన సోషల్ మీడియా అకౌంట్ లో తన ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోల్లో అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతోంది. చీరకట్టులో అందర్నీ ఆకట్టుకుంటోంది. తన చిరునవ్వుతో చిలిపిగా ఫోజులు ఇస్తూ యువతను మైండ్ బ్లాక్ చేస్తోంది. ఆమె క్యూట్ లుక్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవతలా అనుపమను అభిమానులు అభివర్ణిస్తున్నారు.