కాంగ్రెస్‌లోకి త్రిష ఎంట్రీ… త్రిష స్పందన ఇదే!

హీరోయిన్ త్రిష గురించి తెలుగు జనాలకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మొదట తెలుగునాట ఓ ఊపు ఊపిన త్రిష తరువాతి కాలంలో తమిళనాట వెళ్లి అక్కడ ప్రస్తుతం అగ్ర తారగా వెలుగొందుతోంది. 40 పడిలో పడుతున్నా ఇప్పటికీ వన్నె తరగని అందంతో త్రిష కుర్రకారుని కవ్విస్తోంది. మొన్నటికి మొన్న 90 సినిమాలో నటించి యావత్ తమిళ తంబీలకే కాకుండా తెలుగు కుర్రాళ్లను కూడా తమ 90sలోకి తీసుకుపోయింది. ప్రస్తుతం త్రిష సమయం నడవడంతో రాజకీయాలు కూడా ఆమెని వదలడం లేదు.

అవును, తమిళ రాజకీయాల గురించి అందరికీ తెలిసినదే. ఆనాటి నుండి ఈనాటి వరకు అవి సినిమా వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే సినీ నటి త్రిష తాజాగా రాజకీయాల గురించి ప్రశ్నలు అడగడంతో స్పందించింది. కాగా ఆమె పదవుల కోసం రాజకీయాల్లోకి కాకుండా పూర్తిగా ప్రజాసేవకి అంకితం అయ్యే త్యాగం చేయగలిగితేనే రాజకీయాల్లోకి వెళ్లాలని త్రిష అభిప్రాయపడ్డారు. అయితే తనకు అంత ఓపిక, ధైర్యం లేవని కూడా పేర్కొన్నారు. త్రిష సహా చిత్రబృందం ‘రంగీ’ ప్రమోషన్ వర్క్ కోసం ప్రెస్ మీట్‌లో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

కాగా త్రిష తెరపై 20 ఏళ్లుగా ఒక యేలు ఏలుతోంది. కాగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కొన్నాళ్ళనుండి స్టార్ట్ అయింది. కాగా నేడు ఆ సమాచారం ఒక్క శాతం కూడా నిజం కాదు అని నిరూపితం అయింది. ఈ సందర్భంగా పెళ్లి ప్రస్తావన రాగా పెళ్లి గురించి, అభిమాన న‌టుడు అనే ప్ర‌శ్న‌ల‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిద‌ని బదులిచ్చారు. ఎంజియుమ్ అమైత్, ఇవాన్ అహే మఖిల్, వలియవన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎం.శరవణన్ త్రిషతో `రాంకీ` సినిమాకి దర్శకత్వం వహించారు. కొద్ది రోజుల క్రితం ‘రంగీ’ సినిమా ట్రైలర్ విడుదలై వైరల్‌గా కాగా పలు వివాదాల్లో చిక్కుపోయింది. డిసెంబర్ 30న సినిమా థియేటర్లలోకి రానుంది.