‘ 18 పేజెస్ ‘ కి సూపర్ రెస్పాన్స్…3 రోజుల కలెక్షన్లు ఇవే..!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ – అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన అద్భ‌త ప్రేమ క‌థా కావ్యం మూవీ 18 పేజెస్. సుకుమార్ శిష్యుడు కుమారి 21 ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్ల ఈ శుక్ర‌వారం మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ధ‌మాకా సినిమాకు పోటీగా థియేట‌ర్లలోకి వ‌చ్చింది.

Nikhil : 18వ తారీఖు సుకుమార్ రాసిన '18 పేజీలు' | 18 Pages release date fix

ఇక కంప్లీట్ క్లాస్ ల‌వ్ స్టోరీగా సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. ఈ సినిమాకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల్లో రు. 11 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు కంటే కూడా మూడో రోజు 18 పేజెస్ ఎక్కువ‌ వసూళ్లను రాబట్ట‌డంతో ఈ సినిమా ప‌ట్ల రోజు రోజుకు ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది..

18 Pages': Nikhil Siddhartha joins the last leg of shooting | Telugu Movie  News - Times of India

ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా కి స్టోరీ ను అందించగా, గీతా ఆర్ట్స్ 2 మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా లాంగ్ ర‌న్‌లో ధ‌మాకాతో పోటీ ఏ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందో ? చూడాలి.