లెక్క‌ల మాస్టార్‌తో ప్ర‌భాస్ పాన్ ఇండియా మూవీ.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ `ఆదిపురుష్‌`ను కంప్లీట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె`, ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాలను చేస్తున్నాడు. వీటితో పాటే ప్రముఖ దర్శకుడు మారుతితో ఓ ప్రాజెక్టును ప్రారంభించారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వకుండానే ఈ మూవీ షూటింగ్ చక‌చ‌కా జరిగిపోతోంది.

మరోవైపు సందీప్‌ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే మూవీ చేసేందుకు ఒప్పుకున్నాడు. అయితే తాజాగా మరో స్టార్ డైరెక్టర్ కు ప్రభాస్ ఓకే చెప్పాడంటూ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఇంత‌కీ ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు మన లెక్కల మాస్టార్ సుకుమార్. గత ఏడాది పుష్పతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సుకుమార రీసెంట్ ను ప్రభాస్ ను కలిసి ఒక కథ వినిపించాడట. ప్రభాస్ కు కథ నచ్చడం.. సినిమాకు ఓకే చెప్పడం రెండు జరిగిపోయాయ‌ట‌.

వీరి కాంబో ప్రాజెక్ట్‌ ను ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారట. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టు పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారమే నిజమై ప్రభాస్ సుకుమార్ కాంబోలో సినిమా వస్తే బాక్సులు బ‌ద్ద‌లే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప 2ను తెర‌కెక్కించే పనిలో ఉన్నారు. ఈ మూవీ అనంతరం ప్రభాస్ సినిమా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.