`య‌శోద‌` క‌లెక్ష‌న్స్‌.. 4 రోజుల్లో స‌మంత ఎంత రాబ‌ట్టింది? ఇంకెంత రావాలి?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత రీసెంట్‌గా `య‌శోద‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వ‌హించారు. దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్‌ టాక్ ను సొంతం చేసుకుంది.

టాక్ అనుకూలంగా ఉండ‌టంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.70 కోట్లు, 2వ రోజు రూ. 1.76 కోట్లు, 3వ రోజు రూ.1.58 కోట్లు రాబ‌ట్టించిన ఈ చిత్రం.. 4వ రోజు రూ. 69 ల‌క్ష‌లు వ‌సూల్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 1.01 కోట్ల షేర్‌ను క‌లెక్ట్ చేసింది. ఇక ఏరియాల వారీగా య‌శోద 4 డేస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..

నైజాం: 2.96 కోట్లు
సీడెడ్: 53 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 67 ల‌క్ష‌లు
తూర్పు: 35ల‌క్ష‌లు
పశ్చిమ: 21 ల‌క్ష‌లు
గుంటూరు: 38 ల‌క్ష‌లు
కృష్ణ: 39 ల‌క్ష‌లు
నెల్లూరు: 17 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ = 5.66 కోట్లు(10.00 కోట్లు~ గ్రాస్‌)
———————————-

తమిళం – 72 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 85 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్ – 2.15 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్ – 9.38 కోట్లు(20.00 కోట్లు~ గ్రాస్)
———————————-

కాగా, రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ఇంకా రూ. 2.62 కోట్ల షేర్‌ను రాబ‌డితే బాక్సాఫీస్ వ‌ద్ద య‌శోద క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. అయితే లాంగ్ ర‌న్‌లో స‌మంత సుల‌భంగా ఈ టార్గెట్‌ను రీచ్ అవుతుంద‌ని అంటున్నారు.