పవన్ కళ్యాణ్ మరొక కేఏ పాల్ కానున్నారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో చాలా బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో వరుస సినిమాలు ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి కేవలం రాజకీయాల మీద ఫోకస్ పెట్టి ప్రజలలో తిరుగుతూ ఉన్నారు. అయితే ఇలా చేస్తున్న సమయంలో అభిమానుల సైతం సినిమాల విషయంలో కాస్త నిరుత్సాహ చెందుతున్న.. రాజకీయంగా కాస్త ప్రజలలో పేరును బాగానే సంపాదించుకుంటున్నారని ఆనందపడుతున్నారు.

VIDEO: पवन कल्याण ने उड़ाई ट्रैफिक रूल की धज्जियां! कार की छत पर बैठकर किया सफर, वीडियो वायरल - pawan kalyan broke traffic rules travelled sitting on the top of his carఅయితే పవన్ కళ్యాణ్ ప్రజలలో ఎక్కువగా తిరుగుతున్న ప్రజలు నమ్మరని ఆయన కూడా ఒక కేఏ పాల్ లాంటి వ్యక్తి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కామెంట్స్ చేయడం జరుగుతోంది. జనసేన అధినేత మాట్లాడుతున్న తీరును యువత ను చెడు దారికి తీసుకువచ్చేలా ఉందంటూ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఇక విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ అక్కడ 600 కు పైగ లేఅవుట్లు నిర్మించిన వాటితోపాటు 79 వేల ఇళ్లను పరిశీలించారు.. అయితే ఎక్కడ అవినీతి జరిగిందని నిరూపించలేకపోయారని ఆయన తెలియజేయడం జరిగింది.

ఇక పవన్ కళ్యాణ్ యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ ఉండడమే కాకుండా యువతను పెడదారి పట్టించేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారని ఎంపి చంద్రశేఖర్ తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని కేవలం ప్రజలు ఒక నటుడుగానే చూస్తారు కానీ రాజకీయ నాయకుడిగా ఎప్పుడూ గుర్తించలేరని తెలియజేశారు. ముఖ్యంగా వైసిపి అధికారంలోకి రాగానే అవినీతికి ఆస్కారం లేదని కూడా తెలియజేశారు. సచివాలయ ఉద్యోగాలను ఇవ్వడమే కాకుండా వాటి నుంచి అవినీతి లేకుండా అర్హులైన ప్రజలకు మాత్రమే అన్నిటిని ఇస్తున్నామని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తెలియజేశారు.

Share post:

Latest