‘గాడ్ ఫాదర్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎవరు ఊహించని రీతిలో ఉంటుందట. ఇక అందులో చిరంజీవి తన మాస్ లుక్స్ తో ఫైట్లతో అభిమానుల దగ్గర నుంచి విజిల్స్ వేయిస్తాయని.. ప్రధానంగా ఈ సీన్ లో రవితేజ- చిరంజీవి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ కూడా ప్రతి ఒక్క అభిమానికి హృదయానికి హద్దుకునేలా ఉంటుందని తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం దేవిశ్రీప్రసాద్ కూడా అదిరిపోయే బిజిఎం- ఆర్ ఆర్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. తన పాత సినిమాలకు భిన్నంగా డి.ఎస్.పి ఈ సినిమాలో మ్యూజిక్ అందిస్తున్నాడట. ఇక పైగా ఇంటర్వెల్ సీన్లు రవితేజ పాత్ర సినిమాలో ఎంటర్ అవుతుందట. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్ ఈ సినిమాని ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Just watched d 1st Song of #WaltairVeerayya & Mindblown by d Energetic Dance of our #MEGASTAR @KChiruTweets sirr🔥🕺🔥🕺🔥
So Uncontrollably leaking off d news..
1st SINGLE releasin this week🤟🏻Get ready to party..coz its called #BossParty 🕺🎶@dirbobby @MythriOfficial pic.twitter.com/R5UczoAdEt
— DEVI SRI PRASAD (@ThisIsDSP) November 13, 2022