సాయి పల్లవి ఇంట పెళ్లి భాజా..అమ్మ నీ ఏం ట్వీస్ట్ ఇచ్చింది రా ఈ హైబ్రీడ్ పిల్ల..!?

ఏంటో సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు ఒకరి తరువాత ఒకరు పెళ్లిళ్లు చేసేసుకొని లైఫ్లో సెటిలైపోతున్నారు. ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతకంటే త్వరగా గుడ్ న్యూస్ చెబుతూ అభిమానులకి డబుల్ ఉత్సాహాన్ని ఇస్తున్నారు . ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ , అలియాభట్ , కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి , టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరూ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు.

Sai Pallavi With Her Sister Pooja And Family - YouTube

కాగా రీసెంట్ గానే టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య కి కూడా పెళ్లి ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయన పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు అనూష శెట్టి . పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు మరో హీరోయిన్ సైతం పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మలర్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలు మార్చేసింది.

Pin by Ramjanampal on Accesories | Actresses, Movie photo, Samantha photos

హీరోయిన్స్ గ్లామరస్ పాత్రలు కాకుండా నటన పరంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవచ్చు అంటూ చెప్పి లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ ను అందుకున్న సాయి పల్లవి తన చెల్లిని సైతం సినిమా రంగంలోకి దించింది . కాగా ఇప్పుడు సాయి పల్లవి చెల్లి పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తన సొంత బావని సాయి పల్లవి సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందట. ఎటువంటి హంగామా లేకుండా చాలా సింపుల్గా సాంప్రదాయబద్ధంగా ఇంట్లోనే పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి సాయి పల్లవి ఈ వార్త పై ఎలా స్పందిస్తుందో..?

Share post:

Latest