ప్రతి ఒక్కరి జీవితంలోను బాల్యం చాలా మధురంగా ఉంటుంది. నో టెన్షన్స్ , నో వరీస్..ఓన్లీ హ్యాపీ అలా బాల్యం మొత్తం సరదాగా గడిచిపోతుంది . అయితే ఒక్కసారి బాల్యం నుంచి వెనక్కి వచ్చాక ఆ ఫోటోలు చూసుకుంటే ఇది మనమేనా.. ఈ ఫోటోలో ఉన్నది అన్నంత క్యూట్ గా ఉంటాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ చిన్నప్పుడు ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి . మరీ ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ చిన్నప్పటి ఫోటోలు అయితే చాలా క్యూట్ గా ముద్దుగా ఉంటున్నాయి .
ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్స్ అందరి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్గా ఈ ఫోటోలో కనిపిస్తున్న పాప ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోయింది. పైన ఈ ఫోటోలో చాలా క్యూట్ గా స్మైలీగా కనిపిస్తున్న ఈ పాప ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ హీరోయిన్ . అంతేకాదు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించి ఇండస్ట్రీని ఊపు ఊపేసింది. కాగా హీరోయిన్గా ఎటువంటి రిమార్కులు లేని బ్యూటీ వ్యక్తిగతంగా మాత్రమే ఈ మధ్యకాలంలో ఎక్కువ ట్రోలింగ్ కి గురవుతుంది. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మడు పేరు సోషల్ మీడియాలో రేంజ్ లో వైరల్ గా మారింది .ఇప్పటికే ఈ బ్యూటీ ఎవరో మీరు గుర్తుపట్టేసుంటారే..
ఓకే గుర్తుపట్టలేకపోతున్నారా.. నేనే చెప్పేస్తాను… ఈ ఫోటోలో క్యూట్ గా ఉన్న పాప ఎవరో కాదు ..టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కుర్రాల మతులు పోగొట్టిన ఈ బ్యూటీ.. రీసెంట్గా యశోద సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . సినిమాల పరంగా ఎటువంటి రిమార్కులు లేని సమంత వ్యక్తిగతంగా నాగచైతన్యకు విడాకులు ఇచ్చి నెట్టింట ట్రోలింగ్ కి గురవుతుంది . అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే సమంత మనసు హార్ట్ చేశాడనే నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది అంటూ ఓ న్యుస్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా సరే ..ఎవరు ఎన్ని అంటున్నా సరే.. తను ఇష్టపడిన పని చేయడానికి ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తా అంటుంది సమంత . యశోద సూపర్ హిట్ అందుకున్న సమంత త్వరలోనే శాకుంతలంతో మరో హిట్ ని అందుకోబోతుంది.