అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో దఢక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది జాన్వీ కపూర్. ఈమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. శ్రీదేవి ఎక్స్ పోజింగ్ లేకుండా తన అందం అభినయంతో ఎంతో పేరు తెచ్చుకుంది.
కానీ జాన్వి కపూర్ ఎక్స్ పోజింగ్ కి గ్లామర్ షో కి హద్దే లేనట్టుగా తన హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ ఫోటో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తుంది. ఆ ఫోటో లో తాను హాట్ గా ఉన్నానా అంటూ అభిమానులకు ప్రశ్న కూడా వేసింది. జాన్వీ తన ఫాలోయింగ్ ను పెంచుకోవడానికి ఇలా చేస్తుందని తెలుస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ ఓ కొంటి పని చేసింది. ఓంశాంతి ఓం సినిమాలో దీపికా పదుకొణె నటించిన ఓ సన్నివేశానికి తన స్టైల్ లో నటించి ఆ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
తన పాత ఫోటోలకు భిన్నంగా జాన్వి ఈవీడియోలో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పైనుంచి కిందకి ఒకే డ్రెస్ ను ధరించి ఆమె ఈ శాంతి చూడడానికి చాలా భిన్నంగా కనిపిస్తుంది. శాంతి మృతదేహం ఈ షాండ్లియర్ కింద చూడొచ్చు అంటు ఒక క్యాప్షన్ ఇచ్చింది. ఆ వెంటనే ఈ వీడియోను అక్కడ ఉన్ననేల వైపుకు తిప్పగా అక్కడ జాన్వీ స్నేహితుడు కింద పడుకొని నవ్వుతూ కనిపించారు. సోషల్ మీడియాలో కూడా దీనికి జాన్వీ అభిమానులు భిన్నంగా స్పందిస్తూ వారి స్టైల్లో.. ఇది కామెడీ కాదు.. ఇది శాంతి కాదు.. ఇది ఒక వరస్ట్ కామెడీ.. అంటూ కామెంట్‌లు పెడుతున్నారు.
View this post on Instagram