సామ్‌, కాజ‌ల్, ర‌ష్మికల ఇన్‌స్టా ఆదాయం తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

సాధారణంగా హీరోయిన్లు ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లోనే పలువురు హీరోయిన్లకు కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉంటారు.

ఆ ఫాలోయింగ్ ద్వారానే లక్షలు లక్షలు సంపాదిస్తుంటారు. ఈ లిస్టులో మొదట చెప్పుకోవాల్సిన భామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మ‌డికి ఇన్‌స్టాగ్రామ్ లో 21.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఇన్‌స్టాలో తరచూ ఏదో ఒక బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూనే ఉంటుంది. అయితే అలా బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ పెట్టే ఒక్కో పోస్ట్ కు రూ. 30 లక్షలు తీసుకుంటుందట.

అలాగే సమంత కి ఇన్‌స్టాగ్రామ్ లో 24.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టిందంటే ఆమె అకౌంట్లో రూ. 20 లక్షలు పడాల్సిందే అట. ఇక నేషనల్ క్రష్ రష్మిక విషయానికి వస్తే.. ఈ భామ అతి తక్కువ సమయంలోనే 35.3 మిలియ‌న్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇక ఈమె ఒక్క పోస్ట్ కు రూ. 50 లక్షలు వరకు డిమాండ్ చేస్తుందట. ఒక్క రూపాయి తగ్గినా ఊరుకోదట. మొత్తానికి టాలీవుడ్ లో ఈ ముగ్గురు ముద్దుగుమ్మ‌ల ఆదాయాన్ని చూసి నెటిజ‌న్లు కళ్ళు తేలేస్తున్నారు.