గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్న రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే

ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అగ్రనటులు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్తూరి, ఆమని, మధుబాల వంటి అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్‌లోకి వస్తూ కీలక రోల్స్‌లో నటిస్తూ బాగా బిజీ అయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెరిగిపోవడంతో నటీనటులకు డిమాండ్ కూడా పెరిగింది. అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఇప్పుడు వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలానే ఒకప్పటి అగ్రనటి కూడా ప్రస్తుతం వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఆమె ఎవరో కాదు.. నటి గౌతమి.

గతంలో కమల్‌ హాసన్, గౌతమి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయి. 2015లో విరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పాపనాశం’ సినిమా తరువాత ఆమె సినిమాల నుండి తప్పుకుంది. అప్పటివరకు కమలహాసన్ తో సహాజీవనం చేస్తున్న గౌతమి కొన్ని కారణాల వల్ల కమల్ నుండి విడిపోయి వేరుగా ఉంటుంది. ఆ గొడవలకు కారణం ఏంటి అనేది ఎవరికి తెలీదు. కానీ గౌతమి ఒకసారి కమల్ పై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. దాని తరువాత గౌతమి పాలిటిక్స్ లోకీ రానుంది అనే పుకార్లు పుట్టించారు. మళ్ళీ ఇప్పుడు ఆమె గురించి కొన్ని వార్తలు వినపడుతున్నాయి.

ఒక వెబ్ సిరీస్‌లో గౌతమి కీలక పాత్ర పోషించిబోతుంది అని, త్వరలోనే ఆమె ఈ వెబ్ సీరిస్ షూటింగ్ లో పాల్గొంటుందని కోలీవుడ్ మీడియా లో చర్చలు జరుగుతున్నాయి. గాంధీనగర్ రెండో వీధి, తోడల్లుళ్ళు, బామ్మ మాట బంగారు బాట వంటి సినిమాల్లో రాజేంద్రప్రసాద్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. 2022లో తెలుగులో కూడా ఈ భామ శకుంతలం సినిమాలో నటించింది. అన్నీ మంచి శకునములే మూవీ కూడా చేయనుంది. అలాగే పైన చెప్పిన ప్రాజెక్ట్స్ తో గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వనుంది. మొత్తం మీద అలనాటి భామ ఇప్పుడు సినిమా రంగంలోకి మళ్ళీ అడుగు పెడుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేయనుంది.

Share post:

Latest