సింపుల్ లుక్ లో కూడా మంటలు రేపుతున్న మృణాల్.. ఫొటోస్ వైరల్..!

తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా సీతారామం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాలో ఈమె అందానికి నటనకు ఫిదా అవ్వని వారు బహుశా ఎవరూ లేరేమో.. ఈమె పేరు మృణాల్ ఠాకూర్ అయిన అందరూ ఈమెను సీత అంటూ చాలా గొప్పగా పిలుచుకుంటున్నారు. అంతలా తన నటనతో యువతను మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర లంగా వోణి తెలుగు ప్రేక్షకులను మరింతగా మైమరిపించింది. చీర కట్టులో అంత అద్భుతంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన హాట్ ఫోటోషూట్లు బయటకు రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు.Mrunal Thakur raises the bar in a white co-ord set worth Rs.11,980 :  Bollywood News - Bollywood Hungama

అయితే సీతారామం సినిమా విడుదలయ్యే వరకు ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అందుకే ఈమె మునుపటి ఫోటోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు స్టార్ హీరోల చిత్రాలకు ఛాయిస్ గా మారుతోంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మృణాల్ ఠాకూర్ అందం చూపు తిప్పుకోలేనిది అని చెప్పవచ్చు . ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫార్మెన్స్ మరొక ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా .. హుందాగా నటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ ముద్దుగుమ్మకు ప్రతి ఒక్కరు అభిమానులుగా మారారు.Mrunal Thakur: ఇంతందం దారి మళ్లిందా.. భూమి పైకే చేరుకున్నదా

ముఖ్యంగా మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్టులో కూడా చేరిపోయింది అంటూ నెటిజన్లు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఇదిలా ఉండగా ఎప్పుడు గ్లామర్ షో తో నెట్టింట రచ్చ చేసే ఈ ముద్దుగుమ్మ వస్త్రధారణ ఇప్పుడు మార్చినట్లు తెలుస్తోంది. వైట్ డ్రెస్ లో సింపుల్ లుక్ లో మైమర పిస్తోంది. అంతేకాదు స్టెప్స్ నుంచి అలా దిగుతూ ఇస్తున్న ఫోజులు చూస్తే మాత్రం నిజంగా స్టన్ అవ్వాల్సిందే. అంత అమాయకంగా తన అందంతో కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.