చీర‌లో చెమ‌ట‌లు ప‌ట్టించిన కృతి కర్బంద.. హాట్‌నెస్ ఓవ‌ర్ లోడెడ్‌!

కృతి కర్బంద.. ఈ అందాల సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `బోణీ` అనే తెలుగు చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కు జోడి గా `తీన్ మార్`, ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్ తో `ఒంగోలు గిత్త` చిత్రాలు చేసింది.

అలాగే మిస్టర్ నూకయ్య, ఓం 3D త‌దిత‌ర చిత్రాల్లో మెరిసింది. కానీ, కృతి క‌ర్బంద నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా ప‌డ్డాయి. దాంతో ఆమెపై ఐర‌న్ లెగ్ అనే ముద్ర వేసి ప‌క్క‌న పెట్టేశారు.

కృతి చివ‌ర‌గా `బ్రూస్ లీ` సినిమాతో రామ్ చ‌ర‌ణ్‌కు అక్క‌గా మెరిసింది. ఆ త‌ర్వాత తెలుగు తెర‌పై క‌నిపించ‌లేదు. అయితే క‌న్నడలో ఈ అమ్మ‌డు ప‌లు సినిమాలు చేసింది. కానీ అక్కడ సైతం ఈ బ్యూటీని సక్సెస్ వరించలేదు.

ప్రస్తుతం కృతి బాలీవుడ్ లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదిక హాట్ హాట్ ఫోటోషూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

తాజాగా కూడా చీర‌లో చెమటలు పట్టించే విధంగా ఫోటోషూట్ నిర్వహించింది. ప్లెయిన్ సారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఎద అందాల‌ను క్లోజ్‌గా చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నయి. కృతి అందాలకు కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. ఫైర్‌, హాట్‌నెస్ ఓవ‌ర్ లోడెడ్ అంటూ కామెంట్స్ వ‌ర్షం కురిపిస్తున్నారు.

Share post:

Latest