సంచలనంగా మారిన కృష్ణ వీలునామ.. ఆస్తి లో ఒక్క రూపాయి నరేష్ కి చెందదు..ఎందుకంటే?

కళామతల్లి ముద్దుబిడ్డ ..సూపర్ స్టార్ కృష్ణ శకం ముగిసింది . టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో ఇక సూపర్ స్టార్ కృష్ణ బొమ్మ పడే అవకాశం లేదు. దాదాపు 350కు పైగా సినిమాలలో నటించి హీరో నుండి సూపర్ స్టార్ గా..దాదాపు 350 కు పైగా సినిమాలలో నటించి ..హీరోగా ఆ తర్వాత సూపర్ స్టార్ గా కోట్లాదిమంది అభిమానుల మనసు సంపాదించుకున్న కృష్ణ ..ఈ తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు . గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణ నిన్న తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో.. హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

మొదటనుంచి సూపర్ స్టార్ కృష్ణకు ఏది బాగో లేకపోయినా ఇక్కడే అడ్మిట్ చేసేవారట . అంతేకాదు నమ్రతకు ,గౌతమ్ కు, మహేష్ బాబుకు, సితార పాపకు ఎవరికీ ఏ ప్రాబ్లం వచ్చినా.. ఇక్కడ అడ్మిట్ అవుతారని డాక్టర్స్ చెప్పుకొచ్చారు, కాగా కృష్ణప్రాణాలను కాపాడడానికి స్థాయి శక్తుల ప్రయత్నించామని ..ట్రీట్మెంట్ కు ఆయన బాడీ సహకరించలేదని ..పూర్తి అవయవాలు పాడైపోయాయని.. ఈ క్రమంలోనే ఆయన మరణించారని డాక్టర్స్ చెప్పుకొచ్చారు . దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. మరీ ముఖ్యంగా మహేష్ బాబు మూడు నెలల వ్యవధిలోనే అమ్మను నాన్నను కోల్పోవడం తో మరింత బాధ పడిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే సూపర్ స్టార్ కృష్ణ ఓ బిగ్ బడా హీరో . అప్పట్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ బద్దలు కొట్టాడు . చిరంజీవి కన్నా ఎక్కువగా పారితోషకం తీసుకున్న సినిమాలు ఉన్నాయి. అయితే డబ్బుని ఆదా చేయలేని సూపర్ స్టార్ కృష్ణ ..స్నేహితులకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవారు . అడిగిన వారికి లేదు అనకుండా ఇచ్చేసేవారట. ఇచ్చిన వాళ్లు ఆయనకు మరి తిరిగి ఇచ్చేవారు కాదట. ఇదే విషయంలో ఇందిరా దేవికి సూపర్ స్టార్ కృష్ణకు చాలా గొడవలు అయ్యేటివట .

 

అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ అన్ని సవ్యంగా జరుగుకుంటే వేలకోట్ల ఆస్తిని వెనకేసుకునేవాడు. అయితే తన కెరియర్ లో సినిమాలో ఆపేసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ దగ్గర లాస్ట్ కు మిగిలింది 400 కోట్లు మాత్రమే. కాగా ఆయన వీలునామాలో ఈ 400 కోట్ల ఆస్తిని తన మనవళ్లు, మనవరాలుకు సమానంగా పంచాలి అని రాసి పెట్టారట. ఈ ప్రకారంగా చూసుకుంటే ఆయన కొడుకులు మహేష్ బాబు, నరేష్ కు ఒక్క రూపాయి కూడా చెందదు . ఏది ఏమైనా సరే సినీ ఇండస్ట్రీలో కృష్ణ ఇక లేరు అన్న వార్త వినడానికి చాలా కష్టంగా ఉంది.

Share post:

Latest