ఓటీటి లో వచ్చిన కాంతారా.. నచ్చలేదంటున్న ప్రేక్షకులు.. అందుకేనా..?

కన్నడలో సెన్సేషనల్ హిట్టుగా పేరుపొందిన కాంతార చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడుగా , డైరెక్టర్గా రిషబ్ శెట్టి మంచి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపుగా రూ.400 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించడంతో ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా విచిత్రం నిలబడింది. ఓటిపి ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఎప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఎట్టుకేలకు ఓటీటిలో ఈ చిత్రం ఈ రోజున విడుదలయ్యింది.

Kantara Movie | ಒಟಿಟಿಯಲ್ಲಿ ಕಾಂತಾರ: ಪ್ರೇಕ್ಷಕರು ʻಸಿನಿಮಾ ನೋಡಲು ಮನಸ್ಸಾಗಲ್ಲʼ  ಅಂದಿದ್ಯಾಕೆ? - ವಿಸ್ತಾರ ನ್ಯೂಸ್ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ లో ఈ సినిమా విడుదల అయింది. అయితే ఈ సినిమా చూసి అభిమానులకు చిత్ర బృందం షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికంతటికి సోల్ అయినటువంటి వరాహరూపం సాంగ్ ని మార్చేయడంతో అభిమానులు కాస్త నిరాశతో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ఈ పాట హైలైట్ గా నిలుస్తుంది అలాంటిది ఓటిటిలో వచ్చేసరికి ఈ సినిమా ట్యూన్ మార్చి సరికొత్త మ్యూజిక్ ని విడుదల చేయడం జరిగింది. ఒరిజినల్ సాంగ్ తో పోలిస్తే ఇది అంతగా బాగాలేదని ఓటీటి అభిమానులు నిరుత్సాహంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కొంతమంది ఒరిజినల్ వర్షన్ ని అప్డేట్ చేయండి అంటూ రిషబ్ శెట్టి ని, చిత్ర బృందానికి ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

కానీ తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకొని వరాహరూపం తీశారని మలయాళ బ్యాండ్ తేయ్యికుడం బ్రిడ్జ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉన్నందువలన ఈ పాటని ఈ సినిమా నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిమ్స్ తొలగించడం జరిగింది. మరి అభిమానుల మేరకు కాంతారావు మేకర్స్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.

https://youtu.be/s-dAvVL5D9s?t=109