మ‌రో వివ‌దంలో దిల్ రాజు సినిమా.. ఒకటి తరువాత ఒకటి..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా టాలీవుడ్ స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న బై లాంగ్వేజ్ చిత్రం వారిసు. ఈ సినిమాకు సంబంధించిన చాలావరకు షూటింగ్ పూర్తి అయింది. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ సినిమా విడుద‌ల తేది ప్ర‌క‌టించిన అప్ప‌టి నుంచి ఈ సినిమా వ‌రుస వివాదాలను ఎదుర్కొంటుంది. టాలీవుడ్ లో ఇప్ప‌టికే డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి సిజ‌న్ కు విడుదుల చేయ‌కుడ‌ద‌ని నిర్మ‌త‌లా మండ‌లి నోటిస్ కూడా విడుద‌ల చేసింది. ఇక దీని పై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ‌స్తున్నాయి.

ఈ సినిమాకు పోటీగా టాలీవుడ్ సీనియర్ హీరోలు అయినా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఆ టైంలో వారిసు సినిమా రావడంపై తెలుగు చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఏనుగులను ఉప‌యోగాస్తున్నారని తెలుసుకున్న జంతు సంరక్షణ సంస్థ వారు ఈ సినిమా యూనిట్ కు నోటీసులు ఇచ్చారు. జంతువులను సినిమాలో ఉపయోగించుకోవడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోకుండా ఏనుగులను షూటింగ్లో వాడటం పై జంతు సంరక్షణ శాఖ వారు మేకర్స్ కి నోటీసులు పంపించారు. తెలుగులో ఈ సినిమాను వారసుడుగా తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నాడు.