జాన్వీ అంత‌లా కాకా ప‌డుతున్న పాపం పాప‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేదు!

అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి గారాల తనయ జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అమ్మ ఆశలు, ఆశయాలను భుజాన వేసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ధడక సినిమాతో తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్ లో ఫుల్ బిజీగా మారింది.

అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ సక్సెస్ మాత్రం వరించడం లేదు. రీసెంట్గా ఈ బ్యూటీ నుంచి వచ్చిన `మిలీ` సినిమా సైతం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ లోకి రావాలని తెగ మోజు పడుతుంది. సమయం దొరికినప్పుడల్లా సౌత్ పై తెగ ప్రేమను కురిపిస్తోంది. తాజాగా మరోసారి కాక పట్టే ప్రయత్నం చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..`ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా సౌత్ అమ్మాయినే. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మా నాన్న సినిమా షూటింగ్స్ హైదరాబాద్ లో జరిగిన ప్రతిసారి వచ్చేవాళ్ళం. సౌత్ లో నాకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది.

తెలుగు సినిమా చేయడానికి నేను కూడా ఎదురు చూస్తున్నాను. త్వరలోనే ఆ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను` అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి ఈమె మాటలు బట్టి చూస్తుంటే సౌత్ లో ఎంట్రీ ఇవ్వడం కోసం ఈ భామ బాగా ఆరాటపడుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇంతలా కాకా పడుతున్న పాపం ఈ పాప‌ను సౌత్ స్టార్లు ఎవరూ పట్టించుకోవట్లేదు. మరి ఈ అమ్మడి సౌత్ ఎంట్రీ ఎప్ప‌టికి జ‌రుగుతుందో చూడాలి.