ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ ఇండస్ట్రీలో నైనా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాగానే విడుదలవుతూ సక్సెస్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశం వస్తే ఏ రేంజ్ లో చెలరేగిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా రెండు మూడు చిత్రాలు సక్సెస్ అయ్యాయి అంటే అమాంతం రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉన్నారు. అందుచేతన ఎక్కువగా హీరోయిన్లు అంతా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలలో నటించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
కోలీవుడ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడమే కాకుండా హర్రర్ జోన్ చిత్రాలలో కూడా నటిస్తూ బాక్సాఫీస్ వద్ద పలు విజయాలను అందుకుంది.
మాయా, డోరా, ఐరా వంటి సినిమాలతో విజయాలు అందుకున్న నయనతార ఇప్పుడు కనెక్ట్ అనే సినిమాతో మరొకసారి ప్రేక్షకులను భయపెట్టడానికి సిద్ధమయ్యింది. నయనతార భర్త విగ్నేష్ శివ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించారు.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమధ్య ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఈమె శరీరంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.. అందుకు కోసం కాజల్ పలు రకాలైన కసరత్తులను చేసి పూర్వపు వైభవాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఘోష్టీ అనే ఒక లేడి ఓరియంటెడ్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అత్యంత భయపెట్టే కంటెంట్ ఉన్నట్టుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కురుంగా ప్పియన్ అనే మరొక హర్రర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో కాజల్ కూడా తన పాత్రలతో భయపెట్టనించనున్నట్లు చిత్ర బృందం చాలా ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకేసారి ఇద్దరు హీరోయిన్లు సినిమా రిలీజ్ కాకపోయినా హర్రర్ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో ఎవరు సక్సెస్ అవుతారని అభిమానులు చాలా అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.